Header Banner

ఏపీలో కరెంట్ బిల్లులు కట్టడం ఇకపై చాలా ఈజీ..! సింపుల్‌గా ఇంట్లో నుంచే, జస్ట్ స్కాన్ చేస్తే చాలు!

  Wed Jun 04, 2025 11:07        Politics

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.. ఇకపై ప్రజలు కరెంట్ బిల్లుల్ని చాలా సులభంగా కట్టేయొచ్చు. విద్యుత్ బిల్లులు కట్టేందుకు విద్యుత్ శాఖ కొత్త విధానాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఇకపై జస్ట్ క్యూఆర్ కోడ్ ద్వారా బిల్లులు చెల్లించవచ్చు. ఈ విధానం జూన్ నెల నుంచి వినియోగదారులకు అందుబాటులోకి వచ్చింది. గతంలో ఫోన్ పే, గూగుల్ పే వంటి వాటి ద్వారా కరెంట్ బిల్లులు కట్టే విధానాన్ని తాత్కాలికంగా నిలిపివేశారు. ఈ క్రమంలో ప్రజలు బిల్లులు కట్టడానికి మళ్ళీ కార్యాలయాలకు వెళ్లాల్సి వచ్చింది. తాజాగా ఈ సమస్యను అధిగమించడానికి క్యూఆర్ కోడ్ విధానాన్ని తీసుకొచ్చారు.

క్యూఆర్ కోడ్ ద్వారా బిల్లులు చెల్లించే విధానం వల్ల ప్రజలకు చాలా సులువు అంటున్నారు. ఈ నెలలో జారీ చేస్తున్న విద్యుత్ బిల్లుల్లో క్యూఆర్ కోడ్ ఉంటుంది.. ఆ కోడ్‌ను ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం వంటి యాప్‌ల ద్వారా స్కాన్ చేయాలి. వెంటనే బిల్లు మొత్తం కనిపిస్తుంది.. వినియోగదారుడు ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం పాస్‌వర్డ్ ఎంటర్ చేసి ఓకే చేస్తే బిల్లు చెల్లింపు పూర్తవుతుంది. ఈ సరికొత్త విధానం ప్రభుత్వ సర్వీసులకు వర్తించదని తెలుస్తోంది. బకాయిలు ఉన్న వినియోగదారులకు కూడా ఈ అవకాశం ఉండదని అధికారులు చెబుతున్నారు. అలాగే గత నెల బిల్లు చెల్లించకపోతే.. ఈ నెల బిల్లులో క్యూఆర్ కోడ్ కనిపించదంటున్నారు అధికారులు.


ఇది కూడా చదవండి: ఏపీ మీదుగా బుల్లెట్ ట్రైన్! ఈ రూట్‌లోనే, భూసేకరణకు రెడీ!


ఈ క్యూఆర్ కోడ్‌తో ప్రజలకు విద్యుత్ సేవలను మరింత చేరువ చేసేందుకు.. ఈ కొత్త విధానాన్ని అందుబాటులోకి తెచ్చామని అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వ సర్వీసులు మినహా అన్ని ప్రైవేటు సర్వీసులకు ఈ విధానం వర్తిస్తుంది.. బిల్లులు ఎలా చెల్లించాలో బిల్లు రీడర్స్ వినియోగదారులకు అవగాహన కల్పిస్తారు. క్యూఆర్ కోడ్ ద్వారా విద్యుత్ బిల్లు చెల్లించడం చాలా సులువుగా ఉందని వినియోగదారులు అంటున్నారు. ఫోన్‌పేలో డబ్బులు ఉంటే ఎప్పుడైనా బిల్లు చెల్లించవచ్చని.. దీని ద్వారా సమయం ఆదా అవుతుందంటున్నారు. బిల్లు చెల్లింపు కేంద్రానికి వెళ్లాల్సిన అవసరం కూడా ఉండదంటున్నారు.

విద్యుత్ సేవలు వినియోగదారులకు మరింత చేరువ చేసేందుకు క్యూఆర్‌కోడ్‌ విధానాన్ని అందుబాటులోకి తీసుకువచ్చాము అంటున్నారు అధికారులు. కరెంట్ బిల్లులు ఎలా చెల్లించాలో బిల్లు రీడర్స్ వినియోగాదారులకు అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. మొత్తం మీద ఇకపై కరెంట్ బిల్లులు చెల్లించడం చాలా ఈజీ అయ్యింది. సింపుల్‌గా కరెంట్ బిల్లుపై ఉండే క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే సరిపోతుంది. ఇక ఎక్కడికి వెళ్లాల్సిన పని ఉండదు.. చక్కగా ఇంట్లో కూర్చుని కరెంట్ బిల్లుల్ని ప్రతి నెలా చెల్లించొచ్చు.

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు

 

రిమాండ్ ఖైదీకి మరో షాక్! కోర్టు కీలక ఉత్తర్వులు!

 

పసిడి ప్రియులకు అలర్ట్.. బంగారం ధరల్లో మరోసారి మార్పులు.. ఈ రోజు తులం రేటు ఎంతుందంటే?

 

ఏపీ లిక్కర్ స్కాం కేసు నిందితులకు బిగ్ షాక్.. రిమాండ్ పొడిగింపు - జడ్జి కీలక వ్యాఖ్యలు!

 

కాకాణి బెయిల్ పిటిషన్ కీలక మలుపు! రూ. 250 కోట్ల క్వార్ట్జ్ మిస్టరీలో..!

 

బెంగాల్ లా స్టూడెంట్ అరెస్టు! రంగంలోకి పవన్ కళ్యాణ్!

 

గుంటూరు జిల్లాలో పెరుగుతున్న కరోనా కేసులు... 15 పడకలతో ఐసోలేషన్ వార్డు సిద్ధం!

 

కోహ్లీ రెస్టారెంట్ పై కేసు నమోదు! ఇంతకీ ఏమైందంటే?

 

ట్రంప్ ప్రభావం, మస్క్ యూటర్న్! టెస్లా ప్లాంట్ ఆశలు గల్లంతు.. వాటికే పరిమితం?

 

జూన్‌లో మార్కెట్లోకి 5 కొత్త కార్లు.. పాపులర్ వెహికల్స్‌కు అప్‌గ్రేడ్ వెర్షన్స్ లాంచ్!

 

 పోలవరం-బనకచర్ల ప్రాజెక్టుపై కేంద్రం సమీక్ష..! ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనలు!

 

బెంగాల్ లా స్టూడెంట్ అరెస్టు! రంగంలోకి పవన్ కళ్యాణ్!

 

'స్పిరిట్' వివాదం..! దీపికాకు అండగా నిలిచిన ప్రముఖ దర్శకుడు మణిరత్నం!

 

 వారికి శుభవార్త! ఏపీలో ఆ కొత్త బైపాస్‌పై కొత్తగా రింగ్! కేంద్రం గ్రీన్ సిగ్నల్!

  

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #PowerBillPayment #APElectricity #EasyBillPay #ScanAndPay #DigitalAP #APNews #ElectricityBill